కరీంనగర్ జిల్లా: తేదీ:01-12-2020 రోజు తెల్లవారుజామున గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి ఇండియా 1 ATM ను ద్వంసం చేసి దొంగతనానికి యత్నిస్తుండగా CC కెమెరాలో చిక్కిన దుండగుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు గన్నేరువరం పోలీసు వారు కరీంనగర్ కోర్టు వద్ద వెతుకుతుండగా అదే లక్షణాలతో, ఒక మతిస్తిమితం లేని వ్యక్తి కనబడగా అతన్ని పరిశీలించగా అతని చేతి పై ఫోన్ నెంబర్ పచ్చబొట్టు వేయించి ఉండగా అట్టి నెంబర్ ను సంప్రదించగా ఆ నెంబర్ మతిస్తిమితం లేని వ్యక్తి అన్న మోసిన్ అలీది అని వాళ్ళు west Bengal వాస్తవ్యులని మతిస్తిమితం లేని వ్యక్తి పేరు యాసిన్ అలీ అనే అతను రెండు(2) సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో తప్పిపోయాడని అతని గురించి వెతుకతున్నామని తెలిపారు వెంటనే హైదరాబాద్ లోని వాళ్ల బంధువులు కరీంనగర్ కీ బయలుదేరి వచ్చి అర్థరాత్రి మతిస్తిమితం లేని వ్యక్తిని వాళ్లతో తీసుకునివెళ్లారు
ఈ సందర్భంగా వారు రెండు(2) సంవత్సరాల క్రితం తప్పిపోయిన మతిస్తిమితం లేని వాళ్ల బందువును అప్పగించిన గన్నేరువరం పోలీసులు - ASI ఆనంద్ గారిని, A.సంపత్ కుమార్ మరియు ముస్తఫా అలీ ని, కరీంనగర్ పోలీసులు లను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు
Post a Comment