ఎంపీని దూషించిన రసమయిపై కేసు నమోదు చేయాలి మానకొండూర్ నియోజకవర్గ బిజెపి ఇంచార్జి గడ్డం నాగరాజు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజాస్వామ్య వ్యవస్తను అగౌరవపరిచిన స్థానిక శాసనసభ్యులు రసమయి బాలకిషన్ పై కేసు నమోదు చేయాలని మానకొండూర్ నియోజకవర్గ బిజెపి ఇంచార్జి గడ్డం నాగరాజు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల పోలీస్ స్టేషన్ లో శుక్రవారం పిర్యాదు చేశారు ఈ నెల 8 భారత్ బంద్ లో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ తిమ్మాపూర్ మండలం అల్గునూర్ లో బంద్ కార్యక్రమంలో రసమయి పాల్గొన్నారు ఈ సందర్బంగా బిజెపి పై విమర్శలు చేస్తూ ఎంపీ బండి సంజయ్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డాడని కొన్ని పత్రికల్లో వచ్చిన విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు లక్షల మంది అభిమానులను కూడగట్టుకొని ఒక బీసీ ఎంపీ పై ఎస్సీ కులాన్ని అడ్డుపెట్టుకొని తిట్టడం వల్ల తన లాంటివారు తీవ్ర మనస్తాపానికి, మనోవేదనకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు జాతీయ పార్టీకి రాష్ట్ర ప్రతినిధిగా పనిచేస్తూ తెలంగాణా వ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టుతున్న బండి సంజయ్ ని సంస్కార హీనంగా దూషించడంపై తీవ్రంగా ఖండిస్తున్నామని గడ్డం నాగరాజు మీడియాతో పేర్కొన్నారు ఎస్సీ కులాన్ని అడ్డుపెట్టుకొని కుల దురంహకారాన్ని ప్రదర్శిస్తూ ఎంపీని దూషించి గౌరవ ప్రదమైన ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానపరిచిన రసమయి పై కేసు నమోదు చేయాలని గన్నేరువరం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ దేవేందర్ కు పిర్యాదు చేశారు.ఆయన వెంట మండల బిజెపి అధ్యక్షులు నగునూరి శంకర్,ప్రధాన కార్యదర్శి జాలి శ్రీనివాస్ రెడ్డి, బుర్ర సత్తయ్య గౌడ్,బిజెవైఎం అధ్యక్షులు కూన మహేష్, దళిత మోర్చా అధ్యక్షులు రాజ్ కుమార్,నర్సింహా స్వామి ఉన్నారు
Post a Comment