ఈ అనాధ పిల్లలకి అండగా ఉంధాం: కారంపూడి ఎస్సై గల్లా రవికృష్ణ


ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా  తల్లిదండ్రులు ఎవరూ  లేని అనాధ పిల్లలని  అక్కున చేర్చుకొని వారికి తగిన రీతిలో  సంరక్షణలో   ఉంచాలని  రాష్ట్ర మరియ జిల్లా పోలీస్ అధికారులు ఆదేశాల  ప్రకారం కారంపూడి పట్టణ మరియు  మండల పరిధిలో తల్లిదండ్రులు బంధువులు ఎవరూ  లేని వారి సమాచారం తెలుసుకుంటున్న తరుణంలో కారంపూడి ఎస్ ఐ గల్లా రవికృష్ణ కి  ఒక విషాద   సంఘటన  ఎదురైంది  వివరాల్లోకి వెళ్తే  గుంటూరు జిల్లా కారంపూడి పట్టణంలో   దాదాపు ముగ్గురు  అనాధ పిల్లలకు   తల్లిదండ్రులు కానీ కనీసం  దగ్గర బంధువులు కూడా లేని  వారికష్టాలు  తెలుసుకున్న ఎస్సై , వారి కొరకు  ఎవరైనా  దాతలు ముందుకు రావాలి  పిలుపునిచ్చారు  ఈ సందర్భంగా కారంపూడి గ్రామానికి చెందిన ఒక మహిళ ,  కారంపూడి మండల మహిళ పోలీసులు మరియు కొంతమంది విలేఖర్లు సహాయం చేయటానికి ముందుకి వచ్చారు .   ఇంకా ఎవరైనా దాతలు స్వచ్చంధంగా  ముందుకు వస్తే ఆ ముగ్గురి పేరు మీద బ్యాంక్ లో ఫిక్సిడ్ డిపాసిట్  అందరి దాతల సమక్షంలో చేద్దామని   కారంపూడి ఎస్ ఐ గల్లా రవికృష్ణ  తెలిపారు
Previous Post Next Post