రైతులకు న్యాయం చేయండి - భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు బిట్రగుంట క్రాంతి కుమార్


 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ పిలుపుమేరకు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు  బిట్రగుంట క్రాంతి కుమార్ నేతృత్వంలో చర్ల మండల సీనీయర్ నాయకులు సాధం లోకనాధం ఆద్వర్యంలో రైతులకు న్యాయం చేయాలంటు చర్ల మండల తహశీల్దారుకి వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. 


డిమాండ్ల వివరాలు:


1)సీఎం కేసిఆర్ రైతులకు సన్న వడ్లు సాగు చేయాలని ఇచ్చిన సూచన మేరకు సన్న వడ్లు సాగు చేసిన రైతులకు క్వింటాకు ఇరవై ఐదు వందలు ప్రభుత్వం చెల్లించి కొనుగోలు చేయాలి.

2)రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామంటూ ఇచ్చిన ఎన్నికల హామీని వెంటనే అమలు చేయాలి.

3) కౌలు రైతులకు రైతు బంధు పథకం వర్తింప చేయాలి.

4) ప్రతి సంవత్సరం రైతు బంధు సహాయం విడుదల తేదీలను ప్రకటించాలి.

5)కేంద్ర ప్రభుత్వం వివిధ వ్యవసాయ పధకాలకు ఇస్తున్న సబ్సిడీని (సూక్ష్మ సేద్యం, యాంత్రీకరణ) వెంటనే అమలు చేసి రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలి.

6)ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రీమియాన్ని చెల్లించి నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి.

ఈ వినతిపత్రం అందజేసిన వారిలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రావులపల్లి రమేష్, జిల్లా నాయకులు పాసిగంటి సంతోష్, మండల కన్వీనర్ పుగాకు పూర్ణ చందు, మండల యువమొర్చా నాయకులు కొండేటి శేఖర్,ఇర్పా అంజి బాబు తదితరులు ఉన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post