చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో ఈరోజు వామపక్షాలు అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వారపు సంత లోని దురాక్రమణలు తొలగించాలని పెద్ద ఎత్తునమునిసిపాలిటి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గత 15 రోజుల క్రితం వారపు సంత లోని దురాక్రమణలు తొలగిస్తామని హామీ ఇచ్చిన మునిసిపల్ కమిషనర్ఇప్పటి వరకు చర్యలు ఏవి చేపట్టలేదని తెలిపారు. అధికారులు ఇదేవిధంగా ఆలస్యం చేస్తే తామే తొలగింపు చర్యలు చేపడతామని ప్రయత్నం చేశారు . పోలీసులు వీరి ని అడ్డు కొన్నారు .ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాస్, బీఎస్పీ నాయకులు నందా, సంఘం నాయకులు , తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు వీరికి మద్దతుగా నిలిచారు.
Post a Comment