సీఆర్పీఎఫ్ సూచనల మేరకు బైక్ అంబులెన్సు తయారుచేసిన డీఆర్డీఓ

 


తాజాగా డీఆర్డీఓ పరిశోధకులు ఓ బైక్ అంబులెన్స్ ను రూపొందించారు. సీఆర్పీఎఫ్ సూచనల మేరకు ఈ బైక్ అంబులెన్స్ ను అభివృద్ధి చేశారు. ఈ బైక్ అంబులెన్స్ ను మావోయిస్టు ప్రభావిత అటవీప్రాంతాల్లోనూ, కొండ ప్రాంతాల్లోనూ వినియోగించేందుకు అనువుగా మలిచారు. భద్రతా బలగాల్లో ఎవరైనా గాయపడితే అత్యవసర పరిస్థితుల్లో వారిని తరలించేందుకు ఈ బైక్ అంబులెన్స్ లు ఉపయోగిస్తారు. రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులకు మార్పులు, చేర్పులు చేసి ఒక వ్యక్తిని సురక్షితంగా ఆసుపత్రికి తరలించేలా రూపుదిద్దారు. ఇప్పటికే వీటిని పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించారు.








0/Post a Comment/Comments

Previous Post Next Post