రైతులను ఆదుకోవాలి మంత్రి ఈటలకు అంబటి వినతి

 


రీంనగర్ జిల్లాలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం హుజురాబాద్ లో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖామంత్రి ఈటల రాజేందర్ కు ఆయన ఒక వినతి పత్రం సమర్పించారు. చేతికందే సమయంలో భారీవర్షాలు కురిసి పంటలు దెబ్బతినడం తో జిల్లాలో రైతులు కన్నీరు మున్నీరవుతు న్నారని ఆయన పేర్కొన్నారు. వరికోతలు మొదలు పెట్టే సమయంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటలు నష్టపోవడం వలన రైతులు ఆందోళన చెందుతు న్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించితడిసిన ధాన్యం  కొనుగోలు చేసి పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఆయనప్రభుత్వాన్ని కోరారు.  అంతేకాకుండా జిల్లాలోని అనేక చోట్ల పెసరు,కంది పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల సుమారుగా 400 ఎకరాలలో పంట దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించినా  ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని,నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటే తప్ప వారికి గత్యంతరం లేదన్నారు. జోజి రెడ్డి  వెంట టిడిపి నాయకులు  రామగిరి అంకూస్, సమ్మిరెడ్డి ,రవీందర్, కరుణాకర్ రెడ్డి,సతీష్, శ్రావణ్ తదితరులు ఉన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post