ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో ఉద్యోగావకాశాలు - టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్


 

దేశవ్యాప్తంగా కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్‌లలో ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఉమ్మడి నియామక ప్రాథమిక పరీక్ష ప్రకటన విడుదలైంది. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈ పరీక్ష నిర్వహించనుంది.

Jobsవివరాలు:

ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ 2020

పోస్టుల వివరాలు: టీజీటీ, పీజీటీ, టీఆర్‌టీ

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీతోపాటు బీఈడీ/రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత, సిటెట్/ఆయా రాష్ట్రాల టెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

వయసు: 40 ఏళ్లకు మించకూడదు. ఐదేళ్ల టీచింగ్ అనుభవం ఉన్న వారికి గరిష్ట వయోపరిమితి 57ఏళ్లు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ లిటరసీ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు ఆయా పాఠశాలలు విడుదల చేసే ప్రకటనను అనుసరించి మళ్లీ దరఖాస్తు చేసుకొని తదుపరి ఎంపిక ప్రక్రియకు హాజరుకావాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.800


ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 20, 2020.


పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://aps-csb.in/College/Index_New.aspx


0/Post a Comment/Comments

Previous Post Next Post