బిజెపి కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షునిగా హుజురాబాద్ కు చెందిన న్యాయవాది గంగాడి కృష్ణా రెడ్డి ని నియమించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు గతంలో ఏబీవీపీ బిజెపిలో కీలక బాధ్యతలు నిర్వహించిన గంగాడి కృష్ణారెడ్డి బివిపి హుజురాబాద్ నగర కార్యదర్శి గా కరీంనగర్ జిల్లా సహా ప్రముఖ గా పనిచేశారు ఏబీవీపీ పూర్తి సమయ కార్యకర్తగా చెన్నై కేంద్రంగా తమిళనాడు రాష్ట్రంలో ఏబీవీపీ సంఘటనా కార్యదర్శి గా పనిచేశారు బిజెపి జిల్లా కార్యదర్శి గా నాలుగు పర్యాయాలు జిల్లా ఉపాధ్యక్షులుగా బిజెపి జిల్లా సంస్థాగత శిక్షణ కమిటీ కన్వీనర్ పనిచేశారు సామాన్య కార్యకర్తగా సంస్థాగత విషయాల్లో పట్టున్న నేతగా ఉన్నారు నూతన అధ్యక్షుడు కృష్ణా రెడ్డి కి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు యువకులు ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు
Post a Comment