బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇలాఖాలో దారుణం జరిగింది. ఏకంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు.. పార్టీ కార్యకర్తతో రాసలీలలు నడిపిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. గదిలో నగ్నంగా ఉన్న వీడియోలు ఇప్పుడు బయటకు రావడం కరీంనగర్ లో సంచలనంగా మారింది.
కరీంనగర్ జిల్లాకు(Karimnagar bjp ) చెందిన బీజేపీ ముఖ్యనేత.. జిల్లా అధ్యక్షుడు బస సత్యనారాయణ తమ పార్టీ కార్యకర్తను లొంగదీసుకున్నాడు. అవసరం అనిపించినప్పుడల్లా ఆ మహిళను తనకు నచ్చిన చోటికి పిలిపించుకుని ఏకాంతంగా గడిపేవాడు. జిల్లాలో పార్టీకి పెద్ద ఆయనే కదా. వెళ్లకుంటే పార్టీలు పదవులు రావేమోనని ఆ మహిళ కూడా పిలిచినప్పుడల్లా వెళ్లింది.
అయితే.. వ్యవహారం ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ… గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని బయట పెట్టేసింది ఆ మహిళ. సదరు నాయకుడు గదిలో నగ్నంగా ఉన్న వీడియోలు.. తను చెప్పిన చోటికి రావాలంటూ చేసిన ఫోన్ కాల్ ఆడియోను బయటపెట్టింది. ఇంకేముంది ఆ నాయకుడు అడ్డంగా బుక్కైపోయాడు. దీంతో బేరసారాలు మొదలయ్యాయి.
ఈ విషయం పోలీసులు, రాష్ట్ర నాయకుల దాకా వెళ్లిందట. సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఓ రాష్ట్రనాయకుడు ఇద్దరికి చీవాట్లు పెట్టి.. మ్యాటర్ సెటిల్మెంట్ చేసేశారట. 15 లక్షలు కావాలని మహిళ డిమాండ్ చేయగా.. 9 లక్షలకు మ్యాటర్ సెటిల్ అయినట్టు తెలుస్తోంది.
కానీ తనకు అన్యాయం జరుగుతోందని భావించిన ఆ మహిళ వీడియోలు, ఆడియోలు మీడియాకు చేరవేసింది. ఇదే సమయంలో సదరు నాయకుడు మహిళ ఇంటికెళ్లి దాడిచేసి, ఫోన్ కూడా లాక్కెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో వ్యవహారం మొత్తాన్ని బయటపెట్టేసింది సదరు మహిళ.
గుట్టుగా వ్యవహారాన్ని చక్కబెట్టినా.. ఇప్పుడు అంతా బయటపడటంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తలపట్టుకున్నాడట. అందరికి నీతులు చెప్పే బీజేపీలో ఇలా జరగడం.. అందునా జిల్లా అధ్యక్షుడి సొంతూళ్లో జరగడం చర్చనీయాంశంగా మారింది
అయితే ఈ విషయంపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బస సత్యనారాయణ ను పార్టీ నుంచి తొలగించారు
Post a Comment