సర్పంచ్ ఓరుగంటి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ విధులలో హైడ్రో క్లోరైడ్ పిచికారి

 


సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లిలో సర్పంచ్ ఓరుగంటి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో వీధుల గుండా హైడ్రోక్లోరైడ్ మందును పిచికారి చేయించారు కరోనా నేపథ్యంలో ఎవరు గుంపులుగుంపులుగా తిరగవద్దు అని ప్రజలకు సూచించారు. బయటకు వచ్చే సమయంలో తప్పనిసరి మాస్కు ధరించాలని తెలిపారు. చేతులను శానిటైజర్ తో శుభ్రపరుచుకోవాలి అని అన్నారు. కరోనా వచ్చిన వారు భయపడవద్దని వైద్యుల సలహాలు, సూచనలు పాటించి సమయం ప్రకారం మందులు వేసుకోవాలి అని కోరారు. పదిహేను రోజుల పాటు ఇంట్లోనే ఉంటూ వైద్యులకు సహకరించాలని అన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. చేయించారు

0/Post a Comment/Comments

Previous Post Next Post