అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి అంబటి

 


కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి ఒక ప్రకటనలో

రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో భారీ వర్షాలు కురిసి పంటలు దెబ్బతినడంతో జిల్లాలో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారని ఆయన

పేర్కొన్నారు. వరికోతలు మొదలు పెట్టే సమయంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటలు నష్టపోవడం వలన రైతులు ఆందోళన చెందుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యం  కొనుగోలు చేసి పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే జిల్లాలోని అనేక మండలాల్లో వరి,పత్తి పంటలకు తీవ్ర నష్టం

వాటిల్లిందని,కొన్ని చోట్ల వరిపంటపై ఇసుక మేటలు వేయడంతో వందలాది ఎకరాలు ఇసుకలో

కూరుకుపోయాయని, కోతకు వచ్చిన వరిని ఎలా కోసేదని రైతులు బిక్కుబిక్కుమంటున్నారని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా జిల్లాలోని అనేక చోట్ల పెసరు, కంది పంటలకు కూడా తీవ్ర నష్టం

వాటిల్లిందని పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల సుమారుగా 400 ఎకరాలలో పంట దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం

దురదృష్టకరమని,నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటే తప్ప వారికి గత్యంతరం లేదన్నారు.

కేంద్రప్రభుత్వం ప్రకటించిన పత్తి మద్దతు ధర రూ.5550/-లతో ఈసారి లాభాలు వస్తాయని

ఆశపడ్డ రైతులకు ఈ వర్షాల వలన భంగపాటు మిగిల్చిందని జోజిరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో

రెండే రెండు ప్రధాన పంటలైన వరి,పత్తి కాగా, పత్తి కోత దశలకు చేరుకుని కాయ మురిగిపోవడం వల్ల పెట్టుబడి డబ్బులు వచ్చే అవకాశం లేకుండా పోయిందని ఆయన వాపోయారు. వర్షపు

నీటిలో తడిసి ముద్దయిన పత్తికి మద్దతు ధర సగానికి మించి పలుకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి తక్షణ సహాయం కింద ఎకరాకు రూ.25000/- చొప్పున నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని

జోజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post