LRS ను వెంటనే రద్దు చేయాలి : బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర

 


LRS ను వెంటనే రద్దు చేయాలి ఈ డబ్ల్యూ ఎస్ 10 శాతం రిజర్వేషన్లను తెలంగాణలో అమలు చేయాలి.


కరీంనగర్ జిల్లా : కరోనా పరిస్థితులతో పేద మధ్య తరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ఇలాంటి సమయంలో జనాల్ని ఆదుకోవాల్సిన కెసిఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ సామాన్య ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు అయోమయానికి  గురిచేస్తుందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర అన్నారు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తుల సర్వే, ఎల్ ఆర్ ఎస్ లతో ప్రజలను అయోమయానికి, ఇబ్బందులకు గురి  చేయడం భావ్యం కాదన్నారు. ఆస్తుల సర్వేకు ఎలాంటి చట్టబద్ధత లేదని ఎలాంటి జీవోలు ఇవ్వకుండా, ఇంటర్నల్ సర్కులర్ లతో ప్రజల ఆస్తులు నమోదు కార్యక్రమం చేపట్టిందని  ఆయన దుయ్యబట్టారు.. ఇంటి సర్వే చేపట్టే   అధికారులు, సిబ్బంది ఏ సమయానికి  వచ్చేది తెలియపరచ క పోవడంతో  ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్తుల సర్వేపై ప్రజలను గందరగోళానికి గురిచేసే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని పేర్కొన్నారు. పేద, మధ్య ప్రజలకు ఎల్ ఆర్ ఎస్ గుదిబండలా గా మారిందని, తమకు ఉన్న స్థలంపై ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరు తో దండుకోవడం సరికాదని ప్రజలు గగ్గోలు పెడుతున్న ప్రభుత్వం ప్రజా గోడును పట్టించుకోక పోవడం దారుణమన్నారు..  నిత్యవసర వస్తువులు  ,కూరగాయల ధరలు  పెంచితే పీడీ యాక్ట్ పెడతామని బెదిరించిన ప్రభుత్వం ఇప్పుడు ఎల్ ఆర్ ఎస్ తో  పేద మధ్యతరగతి ప్రజలను ఎల్ ఆర్ ఎస్ తో బెదిరించి దోచుకోవడం సరికాదని వివరించారు.   కులానికి పేదరికానికి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు కూడా విద్యా ఉద్యోగాల్లో ఈ డబ్ల్యూ ఎస్ 10 శాతం కింద రిజర్వేషన్లు కేటాయించి గత రెండు సంవత్సరాల కింద చట్టం చేసినా నేటికీ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు . రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రకుల పేదలకు విద్య ఉద్యోగాల్లో కల్పించిన పది శాతం రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేయకపోవడం తో అగ్రవర్ణ పేదలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఎంసెట్లో అర్హత సాధించిన అగ్రకుల పేద విద్యార్థుల కు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు..  జిహెచ్ఎంసి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేయడం, ఒక వర్గం మెప్పుకోసం నిబంధనలు మార్పు చేయడం టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు.. ఎన్నికల్లో గెలవాలనే తపన తప్ప ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు.. రేపు రాబోయే దుబ్బాక ఎలక్షన్ లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు..

0/Post a Comment/Comments

Previous Post Next Post