హైదరాబాద్ లో తప్పిపోయి గన్నేరువరం పోలీస్ స్టేషన్లో క్షేమంగా ఉన్న బాలుడు


 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి బస్టాండ్ వద్ద ఓ బాలుడు శనివారం  గన్నేరువరం పోలీసులకు కనిపించాడు అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి వివరాలు తెలుసుకోగా బాలుడు హైదరాబాద్ నుండి తప్పిపోయి వచ్చినట్లు బాలుని సమాచారం  గన్నేరువరం పోలీస్ స్టేషన్లో క్షేమంగా ఉన్నట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు బాలునికి అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రస్తుతం గన్నేరువరం పోలీస్ స్టేషన్ నుండి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కి బాలుని అప్పగించినట్లు తెలిపారు ఈ బాలుడు ఎవరికైనా తెలిస్తే వారి కుటుంబ సభ్యులకు తెలియజేసి పూర్తి వివరాల కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారిని  లేదా గన్నేరువరం పోలీస్ స్టేషన్ సెల్ నెంబర్ 9440901948 కి సమాచారం ఇవ్వాలని కోరారు



0/Post a Comment/Comments

Previous Post Next Post