నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదురించి హైదరాబాద్ సంస్థానపు ఉదృత స్వభావాన్నిఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన ఉద్యమ కెరటం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ
జయంతి వేడుకలను ఆదివారం తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ కరీంనగర్ కోఆర్డినేటర్ కళ్యాడపు ఆగయ్య,నగర పార్టీ అధ్యక్షుడు వంచ శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు
పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కళ్యాడపు ఆగయ్య మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య పోరాటం పట్ల ఆకర్షితుడైభారత జాతీయోద్యమంలో భాగంగా ప్రప్రథమంగా 1938లో అరెస్టు అరెస్ట్ అయ్యారన్నారు. నిజాంనియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సాగిన రహస్య కార్యక్రమాలు మొదలుకొని ఆంధ్ర మహాసభ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్నారన్నారు. అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి బాపూజీ చరిత్రపుటల కెక్కారన్నారు. హైదరాబాద్ సంస్థానం
భారత యూనియన్లో విలీనమైన తర్వాత తెలంగాణ ప్రాంతంలో 1952లో జరిగన మొదటిశాసనసభ
ఎన్నికలల్లో ఎన్నికైన తర్వాత 1957లో శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికై ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా,రెండుసార్లు మంత్రిగా పని చేశార న్నారు. బహుజనుల దార్శనికుడిగా బాపూజీ అందరికీ మార్గ దర్శకుడని ఆగయ్య కొనియాడారు ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ కమిటీ సభ్యుడు సందబోయిన
రాజేశం, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రొడ్డ శ్రీధర్, కార్యదర్శి బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, టీఎస్ఎన్వీపార్లమెంట్
అధ్యక్షుడు ఎర్రవెల్లి రవీందర్, ఆర్టీఐ పార్లమెంట్ అధ్యక్షుడు దాసరి రామకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు డాక్టర్ సిహెచ్ నర్సింహా చారి, మిట్టపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment