కరీంనగర్ జిల్లాకు చెందిన వసీం అక్రమ్ . ఊద్యోగరిత్య పోలీస్ డిపార్టుమెంటు లో కానిస్టేబుల్ గా ఊద్యోగం చేస్తున్నాడు.తాను చిన్నతనంలో చాల కష్టాలూ అనుభవించడం జరిగింది.పెద్ద కుటుంబం కావడం తో కేవలం తండ్రి యొక్క సంపాదనతోనే ఇళ్లు గడిచేది.ఆ యెక్క కష్టాలను చుసిన పెద్ద కొడుకు అయిన వసిం ఆక్రం( పేపర్ బాయ్,ఆఫీస్ బాయ్,పెట్రోల్ పంప్ లో,సెక్యురిటి గార్డు, మెడికల్ షాప్ లో,వాటర్ ప్లాంట్ లో,ఎటిఎం టెక్నిషియాన్) గా పనులు చేయాల్సి వచ్చింది.చిన్నతనం తోనే పోలీస్ కావాలనే లక్ష్యం తో 2012 లో పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పడడం తోనే కస్టపడి చదివి సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ కావడం జరిగింది.వీరి తండ్రి పోలీస్ డిపార్టుమెంటు లో ఊద్యోగం చేస్తూ ASI గా విధులు నిర్వర్థించేవాడు.దురదృష్టవసత్తు రోడ్డు ప్రమాదం లో చనిపోయారు. తండ్రి యొక్క గుర్తుగా వీరు ముగురు అన్నదమ్ములు కల్సి తండ్రి గుర్తుగా తన తండ్రి యెక్క యూనిఫామ్ భుజం పైన ఉండే STAR కు ఒక్క ప్రత్యేకత తేవాలని STAR FOUNDATION ను స్థాపించారు.ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఊదేశ్యం నిరుద్యోగులకు ఊద్యోగ సాధనలో తమవంతు సహకరించడం.అదే లక్ష్యంగా 2016 లో జరిగిన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో 120 మందికి ఊచిత ఫిజికల్ కోచింగ్ ఇవ్వగా 108 మంది తుది పరీక్షకు ఎంపికయ్యారు.మరియు వీరు స్థాపించిన స్టార్ ఫౌండేషన్ ఆఫీస్ కు సంబంధించిన ఖర్చులను వీరే స్వంతంగా భరిస్తారు.ఎవరి వద్ద నుండి కూడా ఫండ్స్ తీసుకోరు.ప్రస్తుతం కరీంనగర్ లో జరుగనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ కు ఊచితంగా 250 మందికి ఊచిత శిక్షణ ఇస్తున్నాడు.ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వారిలో తెలంగాణా లోని అన్ని జిల్లాలకు చెందినావారు ఊన్నారు.ప్రతి మనిషి డబ్బు సంపాదన మీదపడితే.. ఇతను మాత్రం నిరుద్యోగులకు తన వంతు ఎవరి సహాయం లేకుండా చేస్తునాడు. మా రిపోర్ట్రర్ టివి తరుపున వసీం కి శుభములు తెలియజేస్తున్నాము .
Post a Comment