జిల్లాలో బహిరంగ గణేష్ ఉత్సవాలకు అనుమతి లేదు - SP సునీల్ దత్


 

కొత్తగూడెం జిల్లా: కరోనా వేగంగా వ్యాప్తి  చెందుతుంన్న నేపధ్యంలో ఈ 22 న గణపతి పండుగను ఉద్దేశించి  పత్రికా ప్రకటన విడుదల చేసిన జిల్లా SP.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా వేగంగా  విస్తరిస్తున్న నేపథ్యంలో రాబోయే వినాయకచవితి పండుగ ఎవరి ఇంట్లో వరే జరుపుకోవాలని, సామూహిక పూజలు, వినాయక మండపాలకు అనుమతిలేదని,  వినాయక విగ్రహాలు ఒక్క అడుగు  మించకుండా ఏర్పాటు చేసుకోవాలని,  బహిరంగ ప్రదేశాలు అయిన రోడ్లు, కూడళ్ళలో  విగ్రహాలు పెట్టడానికి అనుమతిలేదని, గణపతి నిమజ్జనం కూడా వారి ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవాలని, కొవిడ్-19 లాంటి క్లిష్ట పరిస్థితి నేపథ్యంలో పోలీసు వారు ఇచ్చినటువంటి సూచనలు ప్రజలందరూ పాటించి కరోనా వైరస్ ఉద్రుతను తగ్గించ వలసిందిగా కోరుచున్నాము. ఎవరైనా సూచనలు ఉల్లంఘించిన అట్టి వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడును. కావున జిల్లా ప్రజలు తప్పనిసరిగా పాటించి  పోలీసువారికి సహకరించలని కోరారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post