కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో, తనకు చెందిన రెండు చారిటీ సిటీస్ లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు బాధితుల చికిత్స నిమిత్తం వాడుకోవచ్చని క్రైస్తవ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆఫర్ ఇచ్చారు. తనకు సంగారెడ్డి 300 పడకల సామర్థ్యమున్న చారిటీ సిటీ, విశాఖలో 100 పడకల గదులు ఉన్నాయని తెలిపిన ఆయన, వాటిని వాడుకుంటే, తనకు ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించనక్కర లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన ఆయన, దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేయాలని అన్నారు.
Post a Comment