భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ప్రతి చెరువుకు, ప్రతి చేనుకు ఆగస్టులో సాగు నీరు అందించి అన్నదాతల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతామని  మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  స్పష్టం చేశారు శుక్రవారం తిమ్మాపూర్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గన్నేరువరం మండలంలోని భూనిర్వాసితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా మైలారం,ఖాసీంపెట్ గ్రామాలకు చెందిన 5 మంది రైతులకు గాను రూ. 32,64,614 చెక్కులను పంపిణీ చేశారు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ మిడ్ మానేర్, తోటపల్లి ఎగువ కాల్వ ద్వారా రైతులకు సాగునీరు అందించాలనే  ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సంకల్పంతో చేపట్టిన కాలువల నిర్మాణ పనులు ఇప్పటి వరకు 70 శాతం పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన పనులకు గాను భూసేకరణ తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో సైతం సీఎం మరో రూ.4 కోట్లు మంజూరు చేశారని తెలిపారు మానకొండూర్ నియోజకవర్గంలో 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన అవసరాన్ని కేసీఆర్ గుర్తుపెట్టుకొని మొత్తం రూ.30 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు తోటపల్లికి దిగువ భాగాన ఉన్న తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం మండలాల్లో 90 శాతం పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే రసమయి వివరించారు  ఈకార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి,జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి, మాజీ జెడ్పిటిసి జువ్వాడి మన్ మోహన్ రావు, ఎమ్మార్వో రాజేశ్వరి, టిఆర్ఎస్ నాయకులు గంప వెంకన్న, దొడ్డు మల్లేశం,ఏలేటి చంద్రారెడ్డి, గంగుల యువసేన జిల్లా అధ్యక్షుడు తోట కోటేశ్వర్, మానకొండూరు నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు గూడూరి సురేష్, కాంతల విక్రమ్ రెడ్డి, బద్దం సంపత్ రెడ్డి,ఆర్ ఐ రజిని కుమార్, తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post