గుండారెడ్డిపల్లిలో ఘనంగా సిద్ధప్ప వరకవి 117 వ జయంతి వేడుకలు



సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామంలో తెలంగాణ తొలి సమాజ వేదాంత కవి గోల్కొండ కవి సిద్ధప్ప వరకవి రాజయోగి 117 వ జయంతి ఉత్సవాలు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ ఓరుగంటి అశోక్ రెడ్డి మాట్లాడుతూ సిద్ధప్ప వరకవి గుండారెడ్డిపల్లి గ్రామ గొప్పదనాన్ని ప్రపంచానికి చెప్పారని అన్నారు సిద్ధప్ప జీవిత విశేషాలను సాహిత్యాన్ని ఈ తరానికి పరిచయం చేయాల్సిందిగా సాహిత్య సంస్థలని కోరారు. రానున్న రోజుల్లో కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జయంతి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ గ్రామ ఉపసర్పంచ్ భూంపల్లి సంజీవరెడ్డి మాట్లాడుతూ సిద్ధప్ప వరకవి  విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేయుటకు భూంపల్లి కుటుంబ సభ్యుల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ఇందుకు సంబంధించి గ్రామ పంచాయితీ భూమిని సమకూర్చాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధప్ప వరకవి చిన్న కుమారుడు మాణిక్యలింగం సిద్ధప్ప  జీవితాన్ని పరిచయం చేశారు పద్యాన్ని పాడి వినిపించారు. సిద్ధప్ప ఆశ్రమాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు సిద్ధప్ప రాసిన కావ్యాల్ని పునరుద్ధరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు కళ్యాణి, ఉప సర్పంచి రాములు, పంచాయతీ కో ఆప్షన్ సభ్యులు సంజీవరెడ్డి, కనకయ్య, విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆశా అంగన్వాడి కార్యకర్తలు, గ్రామస్తులు యువకులు, పాల్గొన్నారు.
Previous Post Next Post