పార్లమెంట్ లో ఇంగ్లీష్ మీడియంపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ ఆగ్రహం?

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ లో ఎంపీ చేసిన వ్యాఖ్యలపై జిల్లా ఇన్ ఛార్జీ వైవీ సుబ్బారెడ్డితో సీఎం చర్చించారు. ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా రఘురామ కృష్ణంరాజు  మాట్లాడటంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, పార్టీ పరంగా చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని జగన్ అన్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post