కరీంనగర్ జిల్లా : లయన్స్ క్లబ్ గన్నేరువరం మండల కేంద్రం లో జులై 1st డాక్టర్ డే సందర్భంగా డా.గాజుల కేశవులు,డా. ముడికే బాలరాజు,డా స్ తిరుమల్,డా.తిప్పారం శ్రీనివాస్ లను జూలై 1st పోస్టల్ డే సందర్భంగా పోస్ట్ మాన్ జాలి బాలరెడ్డి జులై 1st చాటర్డ్ అకౌంట్ డే సందర్భంగా జాలి లింగారెడ్డి కుమార్తె CA జాలి మామత ను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కాంతాల కిషన్ రెడ్డి వారి సేవలను అభినందించి వారిని శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సెక్రటరీ తేళ్ల రవీందర్,లియో అధ్యక్షుడు గంట గౌతమ్, లయన్ సభ్యులు గంప వెంకన్న, న్యాత సుధాకర్, గొల్లపెల్లి రవి,బూర శ్రీనివాస్, బూర వెంకటేష్, బొడ్డు సునీల్,బుర్ర జనార్దన్ గౌడ్,సంతోష్,శివసాయి తదితరులు పాల్గొన్నారు.