డా.సుధాకర్ ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర బిజెపి నాయకుల డిమాండ్ : మేకల జాన్ బాబు



తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో అధికార పార్టీ రాష్ట్రంలో నిరంకుశ పరిపాలన నడుస్తుందని ,బి జె పి ఎస్ సి మోర్చా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సునీల్ ఇస్కా  ఆదేశాల మేరకు ఎస్ సి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల జాన్ బాబు  ఆధ్వర్యంలో తాడేపల్లి  మండల తాసిల్దార్  కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విశాఖ, నర్సీపట్నం నందు డాక్టర్ సుధాకర్  పైన 16-5-2020 న జరిగినటువంటి అమానుష అవమానకరమైన చర్యలు ఖండిస్తూ ఈరోజు తాడేపల్లి మండలంలో తహసిల్ధారు  కార్యాలయము నందు నిరసన వ్యక్తం చేస్తూ తాడేపల్లి మండల తాసిల్దార్ వారికి మరియు పోలీస్ వారికి  మెమోరాండం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మేకల జాన్ బాబు  మాట్లాడుతూ ఒక దళిత డాక్టర్ సుధాకర్  పైన ఇలాంటి అవమానకరమైన చర్య రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉందని పేర్కొన్నారు సుధాకర్  కేసును ఒక ఇండిపెండెంట్ జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు చేసి సత్వర న్యాయం జరగాలని ఆయన మీద కక్ష సాధింపు పాల్పడినవారిని వారి పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అలాగే డాక్టర్ సుధాకర్ ని వెంటనే విధుల్లోకి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కోరడమైనది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మునగంటి రాఘవాచారి  మాట్లాడుతూ ఇలాంటి చర్యలు అందరూ ఖండించాలని ప్రభుత్వం ఎలాంటి చర్యలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు.బిజెపి నాయకులు జేవియస్  ప్రసాద్ , డొక్కు ఏడుకొండలు ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post