బాణసంచా కర్మాగారాలకు నిలయమైన తమిళనాడులో అనేక ప్రమాదాలు జరిగినా జాగ్రత్త చర్యలు శూన్యం అని చాటుతూ మరో దుర్ఘటన జరిగింది. విరుదునగర్ జిల్లాలోని సత్తూరు సమీపంలోని సిప్పిప్పారై వద్ద ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, మరో ఏడుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. మృతి చెందిన వారిలో ఆరుగురు మహిళలున్నారు. పేలుడు తీవ్రతకు కర్మాగారం పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను సహాయ సిబ్బంది బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు.
Post a Comment