తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ నేపథ్యంలో, పరీక్షల నిర్వహణను ఆపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. నిన్ననే పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. రేపు జరగాల్సిన పరీక్ష మాత్రం జరుగుతుంది. సోమవారం నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడనున్నాయి. ఈ నెల 29న అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Post a Comment