కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ ప్రబలకుండా నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా చూడాలని రాష్ట్ర బిజేపి అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం రాత్రి కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ కె.శశాంక, పోలీస్ కమిషన కమలాసన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, డి.ఎం.హెచ్.ఓ సుజాతతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ కరోనా వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున నగరంలో శానిటేషన్ పనులు ముమ్మరం చేయాలని అన్నారు. ప్రజలు చేతులు శుభ్రం చేసుకునేలా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులు సంచరించిన ప్రదేశాలు, వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
Post a Comment