ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై మారుతీరావు కూతురు, ప్రణయ్ భార్య అమృత స్పందించింది. తన తండ్రి ఆత్మహత్యపై స్పష్టత లేదని తెలిపింది. ఆత్మహత్య వ్యవహారంలో అన్ని అంశాలు తెలియాల్సి ఉందని చెప్పింది. అసలు ఎలా జరిగిందో తెలియదని, ఈ విషయంపై తాను ఈ సమయంలో ఏమీ స్పందించలేనని తెలిపింది. ఈ ఘటనపై తనకు అన్ని వివరాలు తెలిశాక మాట్లాడతానని చెప్పింది. కాగా, 2018 సెప్టెంబరులో ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు మారుతీరావు హైదరాబాద్‌లోని చింతల్‌బస్తీలో ఆర్యవైశ్య భవన్‌లో అనుమానస్పద స్థితిలో మృతి చెందడం అలజడి రేపుతోంది. ఆయన అక్కడ గదిని నిన్ననే అద్దెకు తీసుకున్నాడు.
Post a Comment