తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ లోని అంటువ్యాధుల (క్షయ) ఆసుపత్రిలో కరోనా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాంటూ ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా పట్టించుకోని పాలకులకు ఇప్పుడు అంటురోగాల సమయంలో తమ ప్రాంతం గుర్తుకు వచ్చిందా? అని ధ్వజమెత్తుతున్నారు. అధికార పార్టీ స్థానిక నాయకులపై కూడా మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న తమ ప్రాంతంలో కరోనా వంటి భయంకరమైన వైరస్‌లు వ్యాపించేలా చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ చర్యను నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు ఇక్కడి ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన తెలియజేయగా పోలీసులు వారిని అరెస్టు చేసి తరలించారు.
Post a Comment