రాధిక హత్యకేసులో ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డులను అందజేసిన సీపీ కమలాసన్ రెడ్డి

~అనారోగ్యంతో పడుకున్న బిడ్డ పై విచక్షణ రహితంగా దాడి…
~దిండుతో నొక్కి చంపి…ఆపై గొంతు కోసి…
~చావుతో కొట్టుకుంటున్న కరగని కన్నప్రేగు…
~కళ్ళ ముందే అసువులు బాసిన ఆడబిడ్డ…
~బంగారం,డబ్బు కోసమే హత్యగా చిత్రీకరణ…
~ఖర్చులు భరించలేక కన్నతండ్రి కర్కశత్వం…
~సంచలనం సృష్టించిన రాధిక హత్య కేసులో కీలక మలుపు…
~ప్రతిష్టాత్మక జర్మన్ టెక్నాలజీ వినియోగం…
~21 రోజులు…8 బృందాలు…75 మంది సిబ్బంది …
~కేసును ప్రత్యేక కోణంతో సవాలుగా స్వీకరించిన కరీంనగర్ పోలీస్ బాస్…
~సంచలన కేసుల చేదనలో కరీంనగర్ పోలీసుల మరో రికార్డ్…

~వివరాలు వెల్లడించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి…

ఫిబ్రవరి 10,2020 రోజున కరీంనగర్ పట్టణం లోని విద్యానగర్ లో నివాసం ఉంటున్న ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 19 సంవత్సరాల ముత్త రాధిక ను గొంతుకోసి దారుణంగా హత్య చేసిన కేసును సవాలుగా తీసుకొని,ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం,జర్మన్ టెక్నాలజీ లను ఉపయోగించి, అనారోగ్యంతో ఉన్న బిడ్డకు ఖర్చులు పెట్టలేక కన్నతండ్రే కడతేర్చిన ఘటనను ఎంతో చాకచక్యంగా ఛేదించిన కరీంనగర్ పోలీసులు ….

కేసు వివరాలు…

కరీంనగర్ పట్టణంలోని విద్యానగర్ నందు నివాసం ఉంటున్న ముత్త కొంరయ్య గోదాంగడ్డ లోని గోడౌన్ల యందు హమాలి పని చేస్తూ ఉండేవాడు…గత కొద్ది సంవత్సరాలుగా తన బిడ్డయిన ముత్త రాధిక తీవ్ర అనారోగ్యం,పోలియో తో బాధపడుతూ ఉండేది…రాధిక యొక్క ఆరోగ్యం బాగు నిమిత్తం కుటుంబ సభ్యులు చాలా హాస్పిటల్స్ కి తిరిగి చికిత్స చేయించేవారు…చికిత్స కోసం దాదాపు 6 లక్షల రూపాయల వరకు ఖర్చుపెట్టడం జరిగింది…ఒక సంవత్సరం క్రితం రాధిక పోలియో,శస్త్ర చికిత్స చేయడం వల్ల నయం చెంది,కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ కాలేజి నందు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది…ఇట్టి క్రమంలో గత కొద్ది రోజుల నుండి రాధిక మళ్ళీ అనారోగ్యంతో బాధపడుతుండగా,మళ్ళీ డబ్బులు ఖర్చుపెట్టి నయం చేయించే స్థోమత లేని రాధిక తండ్రి ఐన కొంరయ్య ఎలాగైనా తన బిడ్డను చంపాలని నిర్ణయించుకొని గత కొద్ది రోజులుగా పక్కాగా ప్లాన్ చేస్తూ వచ్చినాడు….తదనుగుణంగా, తమ ఇంట్లో కిరాయికి ఉంటున్న పోచయ్య కుటుంబాన్ని బలవంతంగా 06.02.2020 నాడు ఖాళీచేయించడం జరిగింది…తన పథకం ప్రకారం తేదీ 10,ఫిబ్రవరి,2020 రోజున ఎలాగైనా రాధిక ను చంపాలని నిర్ణయించుకొని, తన భార్యని కూలి పనికి పంపించి,బయట పరిస్థితులు గమనించడానికి కిరాణం షాప్ కి ఉప్పు కొనడానికి వెళ్లినట్లు వెళ్లి,తిరిగి వస్తుండగా తన ఇంటిపక్కన ఫంక్షన్ హాల్ కి వాచ్ మెన్ గా ఉన్న వీరేశం కుక్క చనిపోగా,అతనితో మాట్లాడుకుంటూ వచ్చి,వాళ్ళు అందరూ ఇంట్లోకి వెళ్లిపోగా, ఇంటికి వచ్చిన కొంరయ్య తన బిడ్డ రాధిక బెడ్ పై దుప్పటి కప్పుకొని పడుకోవడం చూసి,అదే అదునుగా భావించి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి,తన బిడ్డ పక్కన గల బరువైన దిండు ను తీసి,రాధిక ముఖం పై శ్వాస రాకుండా అదిమిపెట్టి చంపడం జరిగింది…తర్వాత రాధిక మృతి పై పోలీసులకు అనుమానం రావొద్దని,రాధిక మృతదేహాన్ని బెడ్ పై నుండి కింద వేసి,కిచెన్ లో గల కత్తిని తీసుకువచ్చి, విచక్షణ రహితంగా ఆమె మెడని కోసి,అట్టి కత్తిని కడిగి,రక్తం పడిన బనియన్లని పిండి,పైన ఆరవేసి,ఇంట్లో వాళ్ళకి కూడా అనుమానం రాకుండా అన్నం తిని,టిఫిన్ బాక్స్ పెట్టుకొని,అలాగే బయటకి వచ్చిన తర్వాత ఇంటి వెనకాల కుక్క చనిపోయిన బాధలో ఉన్న వాచ్ మెన్ వీరేశం తో కాసేపు మాట్లాడి,పనికి వెళ్తున్న,డోర్ దగ్గరకి పెట్టుకో బిడ్డ అని గట్టిగా చుట్టుపక్కల వాళ్ళకి వినపడే విధంగా చెప్తూ అక్కడి నుండి అతను పని చేస్తున్న గోదాం కి సైకిల్ పై వెళ్లడం జరిగింది….అలాగే వెళ్లే ముందు ఇంట్లోని సెల్ఫ్ లో గల తన భార్య చైన్ ని కూడా ముందు గానే బియ్యం బస్తాలో కనపడకుండా దాచిపెట్టినాడు…పని వద్దకు వెళ్ళాక ఎవరికి అనుమానం రావొద్దని తన భార్య మరియు ఇతరులకు ఫోన్ చేసి మాట్లాడినాడు…మొబైల్ ఫోన్ ఆఫ్ చేసుకొని,యదా ప్రకారం తన యొక్క హమాలి పనిని రోజంతా చేసుకున్నాడు….

అదే రోజు సాయంత్రం చుట్టుపక్కల వాళ్ళు చూసి,రాధిక హత్య చేయబడిందని తెలుసుకొని, తన కొడుకు వేణుకి ఫోన్ ద్వారా తెలుపగా అతను తన తండ్రికి ఫోన్ ద్వారా తెలపడానికి ప్రయత్నించగా,కలవక పోవడం తో,తన తండ్రితో పాటు పనిచేస్తున్న వాళ్ళకి ఫోన్ చేసి,తన తండ్రితో రాధిక హత్య గురించి చెప్పగా,ఏమి తెలియని వాడిగా ఏడ్పు నటిస్తూ,ఇంటికి వెళ్లినాడు…ఇంటికి వెళ్లినాక అమాయకంగా నటిస్తూ,పోలీసులు వచ్చి ఏమైనా డబ్బులు, బంగారం పోయిందా అని అడుగగా,ఇంట్లో గల 3 తులాల బంగారు ఆభరణాలు మరియు 99000/- రూపాయల( బీరువాలో గల 50,000/- మరియు ప్యాంట్ జేబులో గల 49,000/-) నగదు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి,తన బిడ్డను చంపి ఎత్తుకెళ్లారని కొత్త నాటకానికి తెరలేపాడు…

నిందితుడు పట్టుబడిన విధానం…నేర చేదనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన జర్మన్ టెక్నాలజీ….

కరీంనగర్ తో పాటు,రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఇంటర్ విద్యార్థిని రాధిక హత్యకేసును ఎలాగైనా ఛేదించాలని సవాలుగా తీసుకున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి ఆదేశాలతో,వారి ప్రత్యేక్ష పర్యవేక్షణలో అడిషనల్ డిసిపి అడ్మిన్,లా & ఆర్డర్ చంద్రమోహన్,శ్రీనివాస్ ల ఆద్వర్యంలోని పోలీస్ సిబ్బంది 8 బృందాలుగా ఏర్పడి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో పాటు సిసి కెమెరాలు,పాత నేరస్తుల కదలికలు,సైబర్ ఫోరెన్సిక్ టెక్నిక్స్,వీడియో ఎన్హన్స్మెంట్ టెక్నాలజీ ఉపయోగిస్తూ హైద్రాబాద్ నుండి ప్రప్రథమంగా కరీంనగర్ నందు ఇట్టి కేసులో జర్మన్ టెక్నాలజీ ని ఉపయోగిస్తూ,నిందితుని కోసం ఎంతో పకడ్బందీగా,చురుకుగా వ్యవహరిస్తుండగా లభించిన ఆధారాలను బట్టి,ఉపయోగించిన సాంకేతికతను బట్టి ఇట్టి నేరం చేసింది రాధిక తండ్రి కొమురయ్య నే అని నిర్దారించుకొని,అదుపులోకి తీసుకొని విచారించగా, తను నేరం చేసిన విధానం ను మొత్తం ఒప్పుకోవడం జరిగింది….తర్వాత తన ఇంటిలో బియ్యం బస్తాలో దాచిన బంగారు చైన్ మరియు రాధిక కప్పుకున్న రగ్గును చూపించగా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది…జర్మన్ టెక్నాలజీ ని ఉపయోగించిన హైద్రాబాద్ క్లూస్ టీం మృతురాలి ఇంటి మిద్దెపై ఆరవేసిన కొంరయ్య బనియన్ల మరియు అతని చెప్పులపై రక్తపు మరకలను గుర్తించడం జరిగింది…వీటిని స్టేట్ ఎఫ్.ఎస్.ఎల్. కు పంపి అతితక్కువ సమయంలో డి.ఎన్. ఏ. ఫింగర్ ప్రింటింగ్ ఎనాలిసిస్ చేయగా మృతురాలి డి.ఎన్. ఎ. మరియు అట్టి బనియన్లు,చెప్పుల మీద ఉన్న రక్తం మరకల డి.ఎన్. ఏ. సరిపోల్చగా ఒక్కటే అని నిర్దారణ జరిగింది….

అడుగడుగునా పోలీసులను పక్కదారి పట్టిస్తూ….

రాధిక హత్య కేసులో విచారణ జరుపుతున్న అధికారులను అడుగడుగునా సరైన వివరాలు తెలపకుండా,వేరు వేరు కారణాలు చెప్తూ దర్యాప్తును కొమురయ్య తప్పుదారి పట్టిస్తూ వచ్చాడు…అధికారుల విచారణలో తమ కుటుంబ సభ్యులను కూడా సరిగా విచారించకుండా,పోలీసులు కావాలనే తమ కుటుంబ సభ్యులను తప్పు పడుతున్నారని అందరికి భ్రమ కలిగించి,సానుభూతి పొందే ప్రయత్నం చేసాడు…పోలీసులకు దొరకకుండా ఆధారాలను రూపుమాపే క్రమంలో నేరానికి ఉపయోగించిన కత్తిని కడగడం,అన్నం తినడం,వాచ్ మెన్ వీరేశం తో మాట్లాడడం,పనికి వెళ్లినాక మొబైల్ లో భార్యతో పాటు ఇతరులకు మాట్లాడడం,రోజంతా ఫోన్ స్విచ్చాఫ్ పెట్టుకొని,యదా ప్రకారం హమాలి పని చేసుకోవడం,సాయంత్రం హత్య విషయం తెలియగానే ఎం తెలియనట్లు నటిస్తూ డ్రామా చేస్తూ,బంగారం,డబ్బు కోసమే హత్య జరిగినట్లు నమ్మిస్తూ,అనుక్షణం దర్యాప్తు అధికారాలు పక్కదోవ పట్టిస్తూ వచ్చినాడు…సొంత తండ్రినే కావాలని పోలీసులు అనుమానిస్తున్నారని,కావాలని తనని ఇబ్బంది పెడుతున్నారని కూడా సానుభూతికి ప్రయత్నించాడు…

21 రోజులు…8 ప్రత్యేక బృందాలు….75 మంది సిబ్బంది….

ఇట్టి కేసును ప్రత్యేక కోణం తో సవాలుగా తీసుకున్న పోలీస్ కమిషనర్,మొత్తం సిబ్బందిని 8 బృందాలుగా ఏర్పాటు చేసి,ఒక్కొక్క బృందానికి ఒక బాధ్యతని అప్పగిస్తూ,ఒక్కొక్క కోణం లో విచారణ చేపట్టేలా చర్యలు తీసున్నారు…ప్రేమ వ్యవహారం,పాత నేరస్తుల విచారణ,బంధువులు,చుట్టుపక్కల వాళ్ల విచారణ,అప్పులు తీసుకున్న వారి ప్రమేయం,,ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేరస్తుల విచారణ,సైకో వ్యక్తుల ప్రమేయం ఇలా రకరకాలుగా 21 రోజుల పాటు రాత్రి పగలు తేడాలేకుండా,దర్యాప్తు జరిపిన పిదప ఇట్టి నేరం తన తండ్రే చేసాడని నిర్ణయానికి రావడం జరిగింది…

హత్య చేయబడిన మృతురాలి వివరాలు…

ముత్త రాధిక d/o కొమురయ్య,19సం, కుర్మ ,ఇంటర్ మొదటి సంవత్సరం,r/o విద్యానగర్,కరీంనగర్…

హత్య చేసిన నిందితుడి వివరాలు…(మృతురాలి తండ్రి)..

ముత్త కొంరయ్య s/o మైసయ్య,45సం, కుర్మ,హమాలి r/o విద్యానగర్,కరీంనగర్….

కేసు చేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసుల వివరాలు…

అడిషనల్ డిసిపి (అడ్మిన్) చంద్రమోహన్ & అడిషనల్ డిసిపి (లా & ఆర్డర్) శ్రీనివాస్ ఆధ్వర్యంలో…

1.పి.అశోక్ ,ఏసీపీ,టౌన్…
2.కె.శ్రీనివాస్,ఏసీపీ, సీసీఎస్…
3.సిహెచ్.నటేష్, సిఐ,ఐటి సెల్ & సిబ్బంది…
4.ఏ.ఇంద్రసేనరెడ్డి,సిఐ,సీఎస్బి & సిబ్బంది…
5.కె.రాంచందర్ రావు,సిఐ,సీసీఎస్ & సిబ్బంది…
6.పి.దామోదర్ రెడ్డి,సిఐ,మహిళ స్టేషన్ & సిబ్బంది…
7.ఇ. కిరణ్,సిఐ,హుజురాబాద్ రూరల్…
8.ఆర్.ప్రకాష్,సిఐ,టాస్క్ ఫోర్స్..
9.కె.శశిధర్,సిఐ,టాస్క్ ఫోర్స్ & సిబ్బంది…
10.సీహెచ్. దేవారెడ్డి, సిఐ,2టౌన్..
11.ఎస్. కె.జానిమియా, ఆర్.ఐ, ఎం.టి. ఓ. & సిబ్బంది…
12.టి. మురళి,ఆర్.ఐ, సి.ఎఫ్.ఎల్ & సిబ్బంది…
13.జి. ప్రసాద్,ఎస్సై,సీసీఎస్…
14.జి. అశోక్ రెడ్డి, ఎస్సై,సీసీఎస్…
15.లక్ష్మారెడ్డి,ఎస్సై,సిఎస్బి..
16.బి.వంశీకృష్ణ, ఎస్సై,టాస్క్ ఫోర్స్…
17.ఎం.శ్రీధర్,ఎస్సై,క్లూస్ టీం & సిబ్బంది…
18.ఎన్. స్వరూప్ రాజ్,ఎస్సై,2 టౌన్…

ఇట్టి ప్రతిష్టాత్మక కేసు చేదనలో కీలకంగా వ్యహహరించి,నిందితుడిని పట్టుకోవడంలో శ్రమించిన పై అధికారులను పోలీస్ కమిషనర్ అభినందించి తగు రివార్డులను అందజేయడం జరిగింది..

https://www.youtube.com/watch?v=VOgUwotItrM&t=9s

0/Post a Comment/Comments

Previous Post Next Post