కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని పోషణ్ అభియాన్ పోషణ కార్యక్రమాన్ని మంగళవారం తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించారు పోషణ్ అభియాన్ పోషణ కార్యక్రమంలో భాగంగా కమిటీని ఎన్నుకున్నారు చైర్మన్ గా ఎమ్మార్వో రమేష్, వైస్ చైర్మన్ గా ఎంపీడీవో సురేందర్ రెడ్డి,సభ్యులుగా ఎంపీటీసీలు, మండల అధికారులను సభ్యులుగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా సిడిపిఓ సబిత మాట్లాడుతూ ఈ పోషణ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి 2022 వరకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతి అంగన్వాడి కేంద్రాల్లో పోషణ లోపం జరగకుండా ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి,జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న,ఎంపీటీసీ బొడ్డు పుష్పలత,సూపర్వైజర్ ఆండాళ్, బ్లాండినా, పోషన్ అభియాన్ కోఆర్డినేట్ రాజు, ఏపిఎం లావణ్య,రెవెన్యూ అధికారులు ఆర్ఐ, అంగన్వాడీ టీచర్స్,తదితరులు పాల్గొన్నారు
Post a Comment