కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి లో జిల్లా కాంగ్రెస్ నాయకులు జాగిరి శ్రీనివాస్ గౌడ్ విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ జాడే లేదని మండలంలోని ఏ ఒక్క డబుల్ బెడ్ రూమ్ నోచుకోని పరిస్థితి లో ఉందని మేనిఫెస్టోలో కెసిఆర్ ఇచ్చిన ఆమెని ఇంతవరకు మొదలు పెట్టలేదని ఆనాడు కాంగ్రెస్ హయాంలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు 70 నుంచి 100 ఇండ్ల వరకు మంజూరయ్యాయని ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఊసేలేదని అన్నారు దళితులకు మూడెకరాల భూమి లేనివారికి ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆశతో ఉన్న రైతులు బిక్కుబిక్కుమంటూ చూడాల్సిన పరిస్థితి ఉందని అన్నారు రైతులకు సబ్సిడీ ఆవులను సంవత్సరం దాటిన ఇంతవరకు రెండో విడత ఇవ్వలేదని రైతులు తమ వద్ద ఉన్న డబ్బులను ఖాతాలు జమ చేయడం జరిగిందన్నారు జిల్లా కలెక్టర్ సబ్సిడీ ఆవులు సంవత్సరం గడిచిన బీసీలకు 40,000 ఎస్సీలకు 20,000 జమ చేసిన ఇంతవరకు సబ్సిడీ ఆవులు ఇవ్వలేదని సంవత్సరం గడిచిన రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో చొక్కాల శ్రీశైలం, ఆంజనేయులు,గుంటుక రమేష్ కర్ర అమరేందర్ రెడ్డి, కాలువ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు
Post a Comment