ఇద్దరు వైసీపీ నేతలను ఆ పార్ట అధిష్ఠానం సస్పెండ్ చేసింది. ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నల్లి డేవిడ్, మరో నేత నానీలపై ఈ మేరకు చర్యలు తీసుకుంది. వీరిద్దరూ రాజోలు నియోజకవర్గానికి చెందిన నేతలు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ వీరిపై చర్యలు తీసుకున్నారు. విషయాన్ని పార్టీ క్రమశిక్షణా సంఘం ఓ ప్రకటన ద్వారా తెలిపింది . ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, త్వరలోనే క్రమశిక్షణా సంఘం సభ్యులు రాజోలు నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు సమాచారం.
Post a Comment