కరెంటు అధికారుల నిర్లక్ష్యంతో లబోదిబోమంటున్న చీమల కుంటపల్లె గ్రామ ప్రజలు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లె గ్రామంలో నెలలు గడుస్తున్నా కరెంట్ అధికారులల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో గ్రామ ప్రజలు లబోదిబోమంటున్నారు వివరాల్లోకి వెళితే మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్లల్లో కరెంట్ బిల్లు వచ్చే నెల సారి మినిమం వంద రూపాయలు నుంచి రెండు వందల రూపాయలు వచ్చేది ఒక నెల కరెంట్ బిల్లు ఇరవై ఐదు వందలు రూపాయలు రావడంతో ఇంటి యజమాని గుండెలు ఆగినంత పని అయింది మండలంలోని చీమలకుంటాపల్లె గ్రామంలో కొంతమంది కి నెల బిల్లులు ఒకేసారి 2500,పైకి బిల్లు రావడంతో బిల్లు తీసుకునే అధికారిని చీమలకుంటపల్లె గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్థులు కరెంట్ అధికారుల సిబ్బందిని నిర్బంధించారు మూడు గంటలసేపు ఉద్రిక్తత పెరగడంతో గ్రామ సర్పంచి వచ్చి వెంటనే కరెంట్ బిల్లులపై పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన ఆపేశారు ఈ కార్యక్రమంలో బామండ్ల రవీందర్, గ్రామస్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post