కరీంనగర్ : పట్టణంలోని అంబేద్కర్ నగర్ చెందిన మూడు రోజులు క్రితం జరిగిన 9 సంవత్సరాల బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన విషయం తెలిసిందే ఈ విషయంపై గురువారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆ తల్లిదండ్రులు పట్టణంలోని మూడో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు శుక్రవారం బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పి సుజాత రెడ్డి బాలిక తల్లిదండ్రుల నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం ఆమె మాట్లాడుతూ నిందితులను వెంటనే పోక్సో చట్టం కింద ఉరితీయాలని డిమాండ్ చేశారు రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన శిక్షలు వేయకుండా జైల్లో మేపుతూ గాలికి వదిలేస్తున్నారని అన్నారు ఇలాంటి మృగాలకు ఉరి తీస్తే మరొకరికి భయం ఉంటుంది అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా నాయకురాలు రాగులు లక్ష్మి,శారద, విజయ,స్వరూప, తదితరులు పాల్గొన్నారు
Post a Comment