పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమం లో భాగంగా శుక్రవారం కలెక్టర్ శశాంక్ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి మాదాపూర్ గ్రామాల్లో సందర్శించారు… గుండ్లపల్లి స్టేజీ వద్ద నాటిన మొక్కలను పరిశీలించి వైకుంఠ దామం స్థలాన్ని పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని సర్పంచ్ ను కోరారు.
అనంతరం జంగపల్లి ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్రస్థాయి పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు…అక్కడి నుంచి మాదాపూర్ గ్రామంలో ఉన్న మొక్కలను పరిశీలించి గ్రామంలో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని కోరారు….అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి లో భాగంగా పచ్చదనం పెరగాలని ప్రతి గ్రామంలో నర్సరీ ఉండాలని ప్రతి ఇంటికి కనీసం ఆరు మొక్కలు నాటి దోమలు ఈగలు రాకుండా పరిశుభ్రంగా ఉండేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు…శుభ్రత పెరగాలనే ఉద్దేశంతో నే చెత్తను ప్రతి ఇంటి నుంచి సేకరించి ట్రాక్టర్ల ద్వారా బయట కి పంపించాలన్నారు.ప్రతి గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు ఇవ్వడం జరిగిందని గ్రామంలో వంద శాతం మరుగుదొడ్లు పూర్తి చేయాలని కోరారు…ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి ఎంపీపి తాసిల్దార్ రమేష్ ఎంపీడీవో సురేందర్ సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Post a Comment