జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లో దాడి ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ దాడికి పాల్పడిన తొమ్మిది మంది అనుమానితుల ఫొటోలను దిల్లీ పోలీసులు విడుదల చేశారు. ఈ దాడిలో జేఎన్‌యూ విద్యార్థి నేత అయిషీ ఘోష్ పాత్ర కూడా ఉందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమెకు సంబంధించిన ఫొటోను విడుదల చేశారు. ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈనెల 5న వర్సిటీలోని పెరియర్ హాస్టల్‌పై దాడికి పాల్పడినట్లు సంచలన విషయాలు వెల్లడించారు ఢిల్లీ పోలీసులు. వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన సభ్యులు జేఎన్ యూలోని సర్వర్ రూమ్ ను ధ్వంసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు లేకపోవడం వల్ల నిందితులను గుర్తించడం కష్టమైందన్నారు. దాడి ఘటనకు సంబంధించి మూడు ఎఫ్‌ఐఆర్ లను నమోదు చేశామన్న పోలీసులు.. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని చెబుతున్నారు. దాడికి పాల్పడింది వారేనని విచారణలో రుజువైతే.. చట్ట ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అన్నారు.
credit: third party image reference
Post a Comment