యెమెన్‌ సైనికులే లక్ష్యంగా ఉగ్రవాదులు డ్రోన్‌ క్షిపణితో దాడి : 80 మందికి పైగా దుర్మరణం

యెమెన్‌ ప్రభుత్వానికి సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు మద్దతిస్తుండగా, ఇరాన్ పాలకులు హుతి తిరుగుబాటుదారులకు తమవంతు సహాయాన్ని అందిస్తున్నారు.ఈ ఘటనలో సుమారు 150 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్సను అందిస్తున్నారు.
ఓ మసీదులో ప్రార్థనలు చేస్తున్న సైనికులే లక్ష్యంగా ఉగ్రవాదులు డ్రోన్‌ క్షిపణిని ప్రయోగించడంతో యెమెన్‌ మరోసారి రక్తసిక్తమైంది.మరిబ్‌ ప్రావిన్స్ లోజరిగిన ఈ ఘటన లో 80 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. హుతి తిరుగుబాటుదారులే ఈ చర్యకు పాల్పడి ఉంటారని అనిమానిస్తున్నారు. సైనిక శిబిరంలో ఏర్పాటు చేసిన మసీదులో ప్రార్థనలు జరుగుతున్న వేళ తో భారీ శబ్ధంతో డ్రోన్ బాంబు పేలింది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post