తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగానే జరుగుతున్నాయి. కొవిడ్ విజృంభణ వేళ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో నేతలు అమరవీరులకు నివాళులు అర్పిస్తూ, పలు ప్రాంతాల్లో జాతీయ పతాకావిష్కరణకు మాత్రమే పరిమితం అయ్యారు.
'తెలంగాణ ప్రజలకు, జర్నలిస్టులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు తమదైన సంస్కృతితో, కష్టపడే మనస్తత్వంతో అన్ని రంగాల్లోనూ రాణించాలని . తెలంగాణ ప్రజలు , జర్నలిస్టు కుటుంబాలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ - ఇండియా జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ ట్వీట్ చేసారు.
Post a Comment