సహజత్వాన్ని కోల్పోనున్న టెస్ట్ క్రికెట్...క్రికెట్ కి అనవసర మార్పులు చేస్తున్న ICC ...

లాంగ్ ఫార్మాట్ అయిన టెస్టుల్లో మార్పులు చేసేందుకు ప్రణాళికలు వేస్తోందని తెలుస్తోంది. ఈక్రమంలోనే టెస్టు చాంపియన్‌షిప్‌లో నాలుగురోజుల టెస్టులను నిర్వహించాలని యోచిస్తు్న్నట్లు కన్పిస్తోంది. ముఖ్యంగా దేశవాళీ సిరీస్‌ల నిర్వహణ, ఇతర బోర్డులకు తగిన స్పేస్‌ను కల్పించడం, ప్రేక్షకాదారణ, వ్యయం తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న ఐసీసీ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కాకపోయిన 2023 నుంచి నాలుగోరోజుల టెస్టులు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టెస్టులను ఐదురోజుల నుంచి నాలుగురోజులకు కుదించడం వెనుక బలమైన కారణాలే ఉన్నట్లు వివిధ కథనాలు వెల్లడిస్తున్నాయి. టెస్టులను కుదించడం ద్వారా లభించే సమయంతో మరిన్ని సిరీస్‌ల నిర్వహణకు మార్గం సుగమమవుతుందని ఐసీసీ భావిస్తోంది. మరోవైపు ఈ అంశంపై సరైన నిర్ణయం తీసుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. భావోద్వేగాల ఆధారంగా కాకుండా, వాస్తవాలను బట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. మరోవైపు నాలుగు రోజుల టెస్టుకు అంతర్జాతీయ ప్లేయర్ల సంఘం కూడా సానుకూలంగా స్పందించింది. మూడు ఫార్మాట్లలో ప్లేయర్లు ఆడుతున్నారని, ఆటగాళ్లు అలిసిపోకుండా, గాయాలబారిని పడకుండా నాలుగురోజు టెస్టు ఉపకరిస్తుందని అభిప్రాయపడింది. 

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post