నిర్లక్షణానికి ఒక భారత్ కి చెందిన నిండు ప్రాణం అమెరికాలో బలి

అమెరికా దారుణం చోటు చేసుకుంది . నిర్లక్షణానికి ఒక నిండు ప్రాణం బలైంది  హైదరాబాద్ కు చెందిన 25 ఏళ్ల యువతి చరితా రెడ్డి ఎల్ల అమెరికాలోని మిచిగాన్ లో సాఫ్ట్ వేర్ఇం జనీర్ గా లో పనిచేస్తుంది.  డెలాయిట్ సాఫ్ట్ వేర్ సంస్థలో చరితారెడ్డి ఉద్యోగం చేస్తూ లాన్సింగ్ లో నివాసముండేవారు. 4ఏళ్ల క్రితమే ఆమె తన ఎం.ఎస్ చేసేందుకు అమెరికాకు వెళ్లారు. అయితే, మొన్న రాత్రి 8:50టైంలో ఒట్టావా పరిధిలోని క్రొకెరీ టౌన్ షిప్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కార్ కు ఆక్సిడెంట్ జరిగింది. ఫుల్ గా మద్యం తాగిన ఓ వ్యక్తి చరితా రెడ్డి ప్రయాణిస్తున్న టయోటా కార్ ని వెనుక నుంచి మరొక కారుతో వేగంగా ఢీకొట్టాడు. ఆ సమయంలో చరితారెడ్డి తన కారు వెనుక సీట్ లో కూర్చోవడం వలన ఆమెకు బాగా గాయాలయ్యాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె కోమాలోకి వెళ్లిపోయారు.
సమీపంలోని స్థానిక హాస్పిటల్ కు ఆమెను హుటాహుటిన తరలించగా… అక్కడి వైద్యులు చరితా రెడ్డి బ్రెయిన్ డెడ్ అయ్యిందని చెప్పారు. కారులో చరితా రెడ్డి తో సహా మరో ముగ్గురు ప్రయాణిస్తున్నారు. వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఓ స్థానిక ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. చరితారెడ్డి భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం హైదరాబాద్ కు తరలించనున్నారు. హైదరాబాద్ లోని సికింద్రాబాద్‌ నేరేడ్‌మెట్‌ ప్రాంతంలో నివసిస్తున్న చరితా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post