ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ పరిధిలోని ఇండో-టిబెటన్ బోర్డర్ జవాన్ల బృందంలోని ఒకరు తోటి జవాన్లపై కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సహచర జవాన్లపై సర్వీసు తుపాకీతో కాల్పులు జరిపిన జవాను పేరు రెహమాన్ అని అధికారులు చెప్పారు. అనంతరం గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. ఈ ఘటనలో గాయాలపాలైన వారిని రక్షించేందుకు వైద్యులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. నారాయణ పూర్ లోని ఐటీబీపీ 45వ బెటాలియన్ శిబిరంలో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు వివరించారు. ఆ జవాను ఎందుకు కాల్పులు జరిపాడన్న విషయం తెలియాల్సి ఉంది.
Post a Comment