రాజ్‌భవన్ పేల్చేస్తామని బెదిరింపు లేఖ

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాజ్ భవన్‌ను డైనమైట్‌తో పేల్చేస్తామని ఓ బెదిరింపు లేఖ రావడం యూపీ పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించింది. మరో 10 రోజుల్లో గవర్నర్ రాజ్ భవన్‌ను ఖాళీ చేయకపోతే.. రాజ్ భవన్‌ను పేల్చేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు తమ లేఖలో పేర్కొన్నారు. టిఎస్‌పిఎస్ జార్ఖండ్ పేరిట ఈ లేఖ వచ్చినట్టు తెలుస్తోంది. బెదిరింపు లేఖ వచ్చిన అనంతరం ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ అప్రమత్తమైంది. రాజ్ భవన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించిన ఆ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ.. ఈ ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా తమ ఆదేశాల్లో పేర్కొంది. ఇంటెలీజెన్స్ డైరెక్టర్ జనరల్‌, భద్రతా విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్‌కి ఆదేశాలు జారీచేసిన హోంశాఖ.. బుధవారం సాయంత్రంలోగా పూర్తి నివేదిక అందించాల్సిందిగా స్పష్టంచేసింది. ఇప్పటికే ఈ ఘటనపై హజ్రత్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో ఓ కేసు కూడా నమోదైంది. హోంశాఖ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ లేఖను ఎవరు రాశారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. జులై 20వ తేదీనే ఆనంది బెన్ పటేల్‌ను ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

https://www.youtube.com/watch?v=0NQ4OZrUa44&t=207s

0/Post a Comment/Comments

Previous Post Next Post