ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, స్వామి వారికి కుంభాభిషేకం జరిగే సమయంలో ఇలాంటి వార్తలు రావడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ తరహా వార్తలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. స్వామి వారి మూలవిరాట్ లో నాలుక బయటకొచ్చే విధంగా శిల్పులు చెక్కారన్న వార్త అబద్ధం, ఎందుకంటే, ఒక్క యాదగిరి గుట్టలోనే కాదు శిల్ప శాస్త్రం ప్రకారం వుండే ప్రపంచంలో ఏ నారసింహుడి వారి విగ్రహాన్ని చూసినా నాలుక బయటకొచ్చే ఉంటుందని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా నారసింహస్వామి వారికి సింధూరం వేస్తున్నామని, ఈ క్రమంలో సుమారు పదిహేను అంగుళాల పైచిలుకు అది అతుక్కుపోయి వుందని, దాన్ని స్వయంగా తాము తొలగించామని చెప్పారు. స్వామి వారి మూలవిరాట్ ను తాము తప్ప ఎవరినీ ముట్టుకోనివ్వమని, ఎవరైతే అభిషేకం, అర్చన చేస్తారో వాళ్లే ముట్టుకుంటారని చెప్పారు.
Post a Comment