ఆర్మీ పబ్లిక్‌ స్కూల్ లో టీచర్‌ పోస్టులు ... దరఖాస్తులకు చివరి తేది: 10.06.2021



 సికింద్రాబాద్‌లోని ఆర్‌కే పురం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌(ఏపీఎస్‌).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ సబ్జెక్టుల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


  •  మొత్తం పోస్టుల సంఖ్య: 21



  •  పోస్టుల వివరాలు: పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ)–06, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ)–05, ప్రైమరీ టీచర్లు(పీఆర్‌టీ)–10.


  •  పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ): సబ్జెక్టులు: సైకాలజీ, కామర్స్, జాగ్రఫీ, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌. అర్హత: కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ ఉండాలి. సీబీఎస్‌ఈ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు బోధించిన అనుభవం ఉండాలి.


  •  ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ): సబ్జెక్టులు–ఖాళీలు: ఇంగ్లిష్‌–01, హిందీ–02, సోషల్‌ సైన్స్‌–02. అర్హత: కనీసం 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ చేసి ఉండాలి. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరోతరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు బోధించిన అనుభవం ఉండాలి.


  •  ప్రైమరీ టీచర్స్‌(పీఆర్‌టీ): అర్హత: కనీసం 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ/డీఈడీ చేసి ఉండాలి. ప్రైమరీ తరగతుల విద్యార్థులకు బోధించే నైపుణ్యం ఉండాలి.


  •  వయసు: ఫ్రెష్‌ అభ్యర్థులకు ఐదేళ్ల అనుభవంతో 40 ఏళ్లు మించకుండా చూసుకోవాలి. అనుభవమున్న వారికి ఐదేళ్ల అనుభవంతో 57 ఏళ్లు మించకుండా ఉండాలి.
  •  దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, ఆర్‌కే పురం ఫ్లైఓవర్, సికింద్రాబాద్‌ చిరునామాకు పంపించాలి.


          దరఖాస్తులకు చివరి తేది: 10.06.2021

  •  వెబ్‌సైట్‌: https://www.apsrkpuram.edu.in/


0/Post a Comment/Comments

Previous Post Next Post