వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రోజు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘ఏపీలో రైతుల బాధలను కూడా పట్టించుకోవట్లేదు. చాలా నిర్లక్ష్యంతో పాలన కొనసాగిస్తున్నారు. రాయలసీమ యువత వలసలు పోతున్నారు. అయిష్టంగానే యువత దేశాన్ని వీడి వెళుతున్నారు. రాయలసీమలో పరిశ్రమలు, ఉద్యోగాలు కావాలని వారు కోరుతున్నారు’ అని చెప్పారు. ‘పారిశ్రామిక వేత్తలను వైసీపీ ప్రజా ప్రతినిధులు బెదిరిస్తున్నారు. కియా వంటి పరిశ్రమ సీఈవోనే బెదిరిస్తే రాష్ట్రానికి ఎవరు వస్తారు? కష్టపడితేకానీ రాష్ట్రానికి పెట్టబడులు రావు. 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే అంటున్నారు. అసలు పెట్టుబడులే రాకుండా చేస్తున్నారు.. ఉద్యోగాలు, పరిశ్రమలు ఎలా వస్తాయి? రాయలసీమ యువత మార్పు కోరుకుంటోంది,, ఇక్కడి రాజకీయ సంస్కృతి వారిని భయపెడుతోంది. యువత ధైర్యంగా మార్పుకోసం పోరాడాలి.. లేదంటే మార్పు రాదు. ఈ ప్రాంత అభివృద్ధికి మేము పోరాడతాం’ అని పవన్ చెప్పారు.
Post a Comment