కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పోలీస్ శాఖ మహిళా రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను బాలికలకు అవగాహన కల్పించడానికి మండలంలోని గుండ్లపల్లి సద్గురు కళాశాల , శ్రీ రామకృష్ణ హై స్కూల్ లో ఎస్సై తిరుపతి అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు బాలికలు ఒంటరిగా ప్రయాణించేటప్పుడు హాక్ ఐ యాప్ ను తమ సెల్ ఫోన్ లో తప్పక డౌన్లోడ్ చేసుకొని ప్రయాణ వివరాలను దానిలో నమోదు చేసినట్లు అయితే పోలీసు నిఘా విభాగం వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని గమనిస్తుంది అని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రక్షణ కల్పిస్తుందని తెలిపారు. అపరిచితులను ఎట్టి పరిస్థితిలో నమ్మరాదని అత్యవసర పరిస్థితుల లో 100,112 కు డయల్ చేసి పోలీసు రక్షణ పొందాలని సూచించారు. ఆడపిల్లలు ఆత్మస్థైర్యంతో సమాజంలో మెలగాలని సూచించారు. గ్రామాలలో కళాశాలలో ఎవరైనా ఆడపిల్లలను ఇబ్బంది పెట్టినట్టయితే తమ దృష్టికి తీసుకొని రావాలని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ లు రవీందర్, చాడ రంగారెడ్డి, ప్రధానోపాధ్యాయులు వడ్లకొండ శ్రీనివాస్, ఉపాధ్యాయులు గరిగే రవీందర్, చంద్రమౌళి, ప్రజ్ఞశృతి, రజిత ,శ్రవంతి, గాయత్రి విద్యార్థులు పాల్గొన్నారు.
Post a Comment