కాలుష్య కోరల్లో కారంపూడి - పట్టించుకోని అధికారులు నాయకులు

గుంటూరు జిల్లా కారంపూడి గ్రామములోని వినుకొండ రోడ్డు,నర్సరావు పేట మరియూ దాచ్చేపల్లి వైపు వెళ్ళే అర్ అండ్ బి రోడ్లా ఇరు వైపుల చెత్త కుప్పలు పోసి తగులబెడుతున్నారు. ఈ చెత్త నివాసాలు దగ్గరగా ఉండడం మరియు పొగ వలన స్థానిక ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కారంపూడి కి ఇప్పటివరకు డంపింగ్ యార్డ్ లేదని , ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి చెత్తను యార్డ్ కు తరలించాలని అధికారులను నాయకులను కోరినప్పటికీ ఈనాటి వరకు సరైన చర్యలు తీసుకోలేదు. రోడ్డుకు ఇరు వైపులా పోసిన చెత్త కుళ్ళిన దుర్వాసన మొరోవైపు ఇటుక బట్టిల వలన వస్తున్న పొగ , దుమ్ము స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగ మారింది. కాలుష్య ప్రభావము వలన శ్వాస కోశ , గుండె జబ్బులు, జ్వరాలు మొదలగు వ్యాదులు సోకి ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

 KAARAMPUDI TO VINUKONDA ROAD

 

0/Post a Comment/Comments

Previous Post Next Post