హైదరాబాద్ ప్రతినిధి : కవాడిగూడకు చెందిన అలోక్ వర్ధన్ సింగ్ తనకు విడాకులు కావాలంటూ మూడేళ్ల క్రితం అదనపు కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు విచారణ ప్రారంభమైనా వాయిదాలు పడుతున్నాయి. ఫిర్యాదుదారుడిని కలిసిన బెంచి క్లర్క్ బొజ్జా రామకృష్ణ సమస్య త్వరగా పరిష్కారం కావాలంటే తనకు ఒక బైకు, సంబంధిత జడ్జికి రూ. 15లక్షలు ఇవ్వాలన్నాడు. ఇవన్నీ ఇస్తేనే విడాకుల ఉత్తర్వులు వస్తాయని చెప్పాడు.అలోక్ వర్ధన్ కొద్దిరోజుల క్రితం అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ACB అధికారులు. ముందు అడ్వాన్స్ గా రూ.4లక్షలు ఇస్తానంటూ అలోక్ వర్ధన్‌తో రామకృష్ణకు చెప్పించారు. మంగళవారం డబ్బు తీసుకొస్తానని, అప్పటిదాకా కోర్టులో ఉండాలని ఆయన సూచించాడు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఉదయం 10.30గంటలకు అక్కడికి చేరుకున్నారు. అనంతరం రామకృష్ణను ఫ్యామిలీ కోర్టు నుంచి బయటకు రప్పించారు. ఇద్దరి మధ్య సంభాషణలు, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని సాయంత్రం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జైలుకు తరలించారాని సమాచారం .
Post a Comment