దిశ ఘటనపై కామారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్ శోభ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘దిశ వాళ్ల పేరెంట్స్ కు టచ్ లోనే ఉండదు.. అర్థమైపోతోంది. ఆమె.. సిస్టర్ కి ఫోన్ చేయడమేంటి? తండ్రికి ఫోన్ చేయాలి. ఆమె గెజిటెడ్ ఆఫీసర్ భయపడమేంటి? ఎక్కడ ధైర్యం కోల్పోయింది? పేరెంట్స్ దగ్గర ధైర్యం కోల్పోయింది.. పేరెంట్స్ నిలదీయాలి’ అని అన్నారు. పిల్లల పట్ల పేరెంట్స్ ఎలా ఉండాలో అవగాహనా సదస్సుల్లో నేర్పించాలని సూచించారు. రోడ్లపై ఇలాంటి సంఘటనలు కంప్లసరీ జరుగతాయని, ఆపాలంటే ఎట్లా ఆపుతారు? ప్రతిఒక్క పిల్లనూ చూడాలంటే ఎలా చూస్తారు? ప్రతీది గవర్నమెంట్ పై రుద్దడం తప్పు అని శోభ అభిప్రాయపడ్డారు.
దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???
Post a Comment