హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యకేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. స్కూటీ టైర్ పంక్చర్ చేసి నిందితులు డ్రామాలు ఆడారని పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించినట్లు ఉన్నతాధికారులు చెప్పారు. సంచలనం సృష్టించిన కేసును సీరియస్‌గా తీసుకొని 24 గంటల్లోనే ఛేదించి నిందితులను కూడా పట్టుకున్నారు. ఊపిరాడకుండా చేసి ప్రియాంకను దారుణంగా హత్య చేశారు. ప్రియాంకపై నిందితులు గ్యాంగ్ రేప్‌కు కూడా పాల్పడ్డారు. మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి కిరోసిన్ పోసి తగలబెట్టారు. ప్రియాంక మృతదేహాం 70 శాతం కాలిపోయింది. లారీ డ్రైవర్లు హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. నలుగురు కలిసి అఘాయిత్యం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రియాంక హత్య కేసులో మహ్మద్ పాషా ప్రధాన నిందితుడని పోలీసులు తేల్చారు.
మహ్మద్ పాషాది నారాయణ్‌పేట్ జిల్లాగా గుర్తించారు. యువతిని లారీ డ్రైవర్, క్లీనర్ హత్య చేశారని విచారణలో వెల్లడైంది. ప్రియాంక స్కూటీని నిందితులు ఉద్దేశపూర్వకంగానే పంక్చర్ చేశారు. పంక్చర్ చేయిస్తామంటూ నలుగురు వ్యక్తులు యువతిని నమ్మించారు.
లారీని అడ్డంపెట్టి అమ్మాయిపై దుండగులు దాడి చేశారు. తొండుపల్లి జంక్షన్ వద్ద లారీ వెనకాల ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారు. మృతదేహాన్ని డీసీఎం ఎక్కించి.. అండర్‌పాస్ వరకు తీసుకెళ్లారు.
డీసీఎంలోనూ ప్రియాంకపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. మరో వ్యక్తి స్కూటీ నడుపుతూ వెనకాలే వచ్చాడు. అండర్‌పాస్ కింద ప్రియాంక మృతదేహాన్ని తగలబెట్టారు. అత్యాచారం చేసిన తర్వాతే మృతదేహంపై కిరోసిన్ పోసి లారీ డ్రైవర్, క్లీనర్ కాల్చారు. మృతదేహాన్ని కిరోసిన్‌తో కాల్చినట్లు డాక్టర్లు తేల్చారు. కిరోసిన్ అని తేలడంతో డ్రైవర్లే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
Post a Comment